Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

పరమేశ్వరదర్శన ప్రాశస్త్యం

''నమశివాభ్యాం'' అనే ప్రార్థన శ్లోకాన్ని దాన్ని అర్థాన్ని వివరిస్తూశుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకొనడం విశేషమని, అయితే అమావాస్య, పౌర్ణముల యందు ప్రతి ఏకాదశి. ద్వాదశి, త్రయోదశి చతుర్దశి తిధుల ప్రదోషకాలా లాలనీ, అందులో ప్రబోధషకాలం కూడ కలిస్తే, ఈశ్వర దర్శనం మరీ విశేషము.

సగంభాగం ఈశ్వరుడు, రెండవభాగం పరమేశ్వరి కల ''ఈశ్వరుని దర్శనం'' ఈ ప్రదోష కాలంలోని ప్రదోష సమయంలో మిక్కిలి విశేషం. ''శివం, భద్రం, కళ్యాణం మంగళం, శుభం'' పర్యాయపదాలు. ఇవి అన్నీ అక్షరాలా, శుభంగా, మంగళప్రదంగా జరగాలంటే, ప్రార్థన ముఖ్యము. పరమేశ్వరునికి కామహరుడు, కాలహరుడు అని రెండుపేర్లు గలవు. సహజంగా సహస్రనామాలు ఉన్న ఈశ్వరునికి కామహర, కాలహర-అనే శబ్దాలు ముఖ్యమైనవి. మానవులకు కామమనేది సహజమే. అయినా అది వారిని పతనావస్థకు తీసుకొని వెడుతుంది. అట్టి కామాన్ని హరింపజేసే వాడుగా పరమేశ్వరుని మనం దర్శించాలి. మృత్యువంటే అందరికీ భయం. కాలహరి అనే పరమేశ్వర ధ్యానం ద్వారా ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. మన అవసానకాలంలో ఏరకమైన ఆలోచనలతో మరణిస్తే, ఆ విధమైన జన్మలే వస్తాయి. ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. అంత మాత్రంచేత రేపు చచ్చిపోతామని భయపడకూడదు. భవిష్యత్తును గురించి కూడా భయాందోళనలు పనికిరావు. ధైర్యంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉండాలి. మరణించిన వారిగురించి జీవించివున్నవారు ఏడుస్తారు. కాని ఆ ఏడ్చేవారు కూడా చివరకు పోతారు. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి పశ్చాత్తాపం ఉండాలి. ప్రేమను కలిగి ఉండాలి. అన్యాయం, ఆశ, కోపం, అక్రమసంపాదనేచ్ఛ ఉండకూడదు. విచారపడకూడదు. ద్వేషం ఉండకూడదు, ఈశ్వరదర్శనానికి ఇవి ఆటంకాలు. వీటినుండి విముక్తులైన వారు ఈశ్వరదర్శనం చేయగలుగుతారు. అంతా భగవంతుడే ఇస్తాడనే నిర్లిప్తతతో ఉంటే, ఈశ్వరుడే సమస్తం ఇస్తాడు.

దాని వల్ల మనశ్శాంతి లభిస్తుంది. రోజూ భగవంతుని స్మరణ చేయడం ముఖ్యం, ''శివ శివ శివ'' అని నామస్మరణం చేయండి. యజ్ఞయాగాదులు. తపస్సుకూడా చేయవచ్చు. అయితే వీటన్నిటికంటే సులభతరమైన ఉపాయం ''శివనామస్మరణం.''

సామాన్యంగా ప్రాణులలో ఎక్కువభాగం ''తిర్యగ్జంతువులు.'' ఇవి అడ్డంగా పెరుగుతాయి, మానవుడొక్కడే ఊర్థ్వలోకాలకు పోతున్నట్లు పైకి ఎదుగుతాడు, మిగిలిన ప్రాణులకంటే మానవునికి నోరు ఒకటి అదనంగా వుంది. ఆ నోరు ''నామస్మరణ'' కొరకే ఉద్దేశింపబడింది. మానవజన్మ ఉత్తమమైనది. పరమేశ్వరానుగ్రహం పొందే అర్హత మానవులకు మాత్రమే ఉంది, కావున సర్వులూ మనః పూర్తిగా శివనామస్మరణచేసి సమస్త శుభాలను పొందండి.

8-19


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page